క్రీడలు,

ఇండియా గ్రాండ్ విక్టరీ…!

20161121_131259-collage

విశాఖ: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 246 భారత్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అచ్చొచ్చిన విశాఖలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తద్వారా ఇంగ్లండ్ 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 167, 81 పరుగులు చేసిన భారత కెప్టెన్ కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఓవర్ నైట్ స్కోరు 87/2తో చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. బంతిని గిరగిరా తిప్పుతూ పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఆత్మ రక్షణలో పడేశారు. వీరి ధాటికి ఇంగ్లండ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.

అశ్విన్ బౌలింగ్‌లో డకెట్ డకౌట్ కాగా, రెండు పరుగులు చేసిన మొయిన్ అలీని జడేజా పెవిలియన్ చేర్చాడు. అనంతరం జయంత్ వేసిన అద్భుతమైన బంతితో స్టోక్స్ క్లీన్ బౌల్డ్ కాగా, రూట్‌, రషీద్ వికెట్లను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాడ్, అండర్సన్ వికెట్లను జయంత్ తీశాడు.

మొదటిసారి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన విశాఖలో భారత్ విజయం సాధించడం విశేషం. వన్డేల్లో ఈ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఈ టెస్టు విజయంతో ఆల్ ఫార్మాట్ ఫెవరెట్ స్టేడియంగా నిలిచింది. ప్రతీకార సిరీస్‌గా భావించే ఈ టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

స్కోరు వివరాలు:

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 455 ఆలౌట్

ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 255 ఆలౌట్

భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 204 ఆలౌట్

ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్: కుక్ 54, హమీద్ 25, రూట్ 25, డకెట్ 0, అలీ 2, స్టోక్స్ 6, బెయిర్ స్టో , రషీద్ 4, అన్సారీ 0, బ్రాడ్ 5, అండర్సన్ 0. మొత్తం 97.3 ఒవర్లలో 158ఆలౌట్

వికెట్ల పతనం: 1-75, 2-87, 3-92, 4-101, 5-115, 6-115, 7-129, 8-143 , 9-158 , 10-158 బౌలింగ్: షమీ 2, అశ్విన్ 3, జడేజా 2, జయంత్ 3

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>