తెలంగాణ

కెసిఆర్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు

kodandaram-kcr1429629526

ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసేసి తెలంగాణలో ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న కేసీఆర్ కు ఒక వ్యక్తి నిద్రలేకుండా చేస్తున్నాడట. ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను కడిగేసేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ముందుకు వచ్చారు. ఆయన తొలుత మౌనంగానే ఉన్నారు. మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా తను ఒప్పుకునేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇందులో భాగంగానే అవసరమయితే తెలంగాణలోని ఇతర పార్టీలను కలుపుకుని పోయేందుకు వెనుకాడేది లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుని ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను ఒకే గొంతుతో వినిపిస్తామన్నారు. తామంతా కలిసి ప్రజల గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తుంటే తమ గొంతును నొక్కేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కోదండరామ్, ప్రైవేట్ యూనిర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. జనవరి 7 నుంచి తామంతా కలిసి తెలంగాణలో కదం తొక్కుతామని వెల్లడించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>