తెలంగాణ

గవర్నర్ కెసిఆర్ ని ఎందుకు తెగ పొగుడుతున్నారు ?

kcr-governor

తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంపై గవర్నర్ నరసింహన్ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే ఎలాంటి వారు సలహాలు ఇచ్చినా ముఖ్యమంత్రి తీసుకుంటారని అన్నారు. తాను ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. ఆయనకు ప్రజలకు మంచి చేయడానికి ఒక ఆలోచన వచ్చిందంటే ఇంకెవరు అడ్డు చెప్పినా ఆ పని చేసి తీరుతారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ గా అభివృద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింహన్ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం ఒక నీటి తొట్టె లాంటిదని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ రంగంలో చాలా పురోగతి సాధించిందన్నారు. శాంతి భద్రతలపై కూడా గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>