సినిమా

ఈ సంక్రాంతి రంజు గా ఉండ బోతోంది

ka

తెలుగు పండగ సంక్రాంతి పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగని టార్గెట్ చేసుకొని బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడానికి రెడీ అవుతుంటాయి. గత ఏడాది మూడు బడా సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ కి దిగి మంచి ఫలితాన్ని సాధించగా, ఈ ఏడాది మెగా స్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150తో పాటు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ నటించిన శతమానం భవతి, దీపిక హాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్, ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.ఈ సంక్రాంతికి అందరికంటే ముందే చిరు తన 150వ చిత్రం ఖైదీ నెం 150తో వస్తున్నాడు. ఈ మూవీని జనవరి 11న విడుదల చేయబోతున్నట్టు యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక శాతవాహన చక్రవర్తి నేపథ్యంలో తెరకెక్కిన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పటికే ఈ మూవీ భారీ అంచనాలు నెలకొనగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన శతమానం భవతి చిత్రం జనవరి 14న విడుదల కానుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేష్న డైరెక్ట్ చేశాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపిక నటించిన హాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్ జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. వీటితో పాటు ఆర్. నారాయణమూర్తి, జయసుధ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.ఒకేసారి ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటి పడేందుకు సిద్ధం కాగా, వీటికి థియేటర్ల కొరత వచ్చి తీరుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఏ చిత్రం ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సాధించి సినీ లవర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందో అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>