సినిమా

ఎన్టీఆర్ తో శ్రీ దేవి

sridevi-kapoor-is-not-coming-for-jr-ntr-movie-1

ఎన్టీఆర్ – బాబీ – కళ్యాణ్‌రామ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఓ కీలకపాత్రలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి కొన్నేళ్ల విరామం అనంతరం దక్షిణాదిలో తమిళ చిత్రం “పులి”తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు ఎన్టీఆర్‌తో జతకట్టనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్త నిజమైతే తెలుగు వెండితెరపై శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ మూవీ ఇదే అవుతుంది. నిజానికి గతంలో దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమా కోసం ప్రాధేయపడినా శ్రీదేవి అంగీకరించని విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ చిత్రంలో క్యారెక్టర్ నచ్చిందంటూ నటించేందుకు సై అన్నారట. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించాల్సి ఉంది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>