సినిమా

ఓవర్ సీస్ మార్కెట్ బాగా పెరుగుతోంది

star-heros

తెలుగులో ఓవర్‌ సీస్‌ మార్కెట్‌ భారీగా పెరిగింది. కొంతకాలం క్రితం వరకు కేవలం తెలుగు నేల మీదే సత్తా చూపే టాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ దుమ్ము రేపి కలెక్షన్‌‌స వర్షం కురిపి స్తున్నాయి. ఈ ఓవర్‌ సీస్‌ కలెక్షన్‌‌స కు వేదికగా ముఖ్యంగా అమెరికా మంచి మార్కెట్‌గా నిలిచింది. ఈ 2016 సంవత్సరం ఓ రోజులో ముగుస్తన్న సందర్భంగా అక్కడ రికార్‌‌డ లు క్రియేట్‌ చేసిన చిత్రాలని పరిశీలిద్దాం. తెలుగుకి పెద్ద మార్కెట్‌ గా మారిన ఓవర్‌ సీస్‌ లో స్టార్‌ హీరోల సినిమాలు ఆడుతున్నాయా..లేక చిన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉంటోందా..ఓవర్‌ సీస్‌ ప్రేక్షకులు ఏమి కోరుకుంటన్నారు, వారికి నచ్చే సినిమాలు ఏమిటి..ఓవర్‌ సీస్‌ ని టార్గెట్‌ చేయాలంటే ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వంటి విషయాలు ఇలాంటి లిస్‌‌ట లతో ఓ అవగాహనకు వస్తాయి. త్రివిక్రమ్‌ మ్యాజిక్‌ .. ఏడాదిలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో అఆ’ యూఎస్‌లో మంచి కలెక్షన్లు రాబట్టి నెంబర్‌ వన్‌ స్థానం దక్కించుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సౄఎష్టించిన ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ దాదాపు 16.37 కోట్లు కలెక్ట్ చేసింది. నాన్నకు ప్రేమతో … ఆ తర్వాతి స్థానంలో నాన్నకు ప్రేమతో’ (13.43 కోట్లు) నిలిచింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఇదే టాప్‌ గ్రాసర్‌. సుకుమార్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. క్లాస్‌ టచ్‌ ఉన్న మాస్‌ ఎలిమెంట్‌‌స ఉన్న సినిమా కావటంతో అందరూ బాగా చూసారు. ఎన్టీఆర్‌ దే ఇంకోటి ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ కాంబినేషన్‌ లో కొరటాల శివ రూపొందించిన జనతాగ్యారేజ్‌ చిత్రం ఓవర్‌ సీస్‌ లో .. 1.80 వరకూ కలెక్టు చేసి మూడో ప్లేస్‌ లో ఉంది. ఎన్టీఆర్‌ నటన, కొరటాల క్లాస్‌ డైరక్షన్‌ , మోహన్‌ లాల్‌ ఎమోషన్‌‌స ని పండించే తీరు ఆకట్టుకున్నాయి. నాగ్‌, కార్తీ మ్యాజిక్‌ నాగార్జున, కార్తి కాంబినేషన్‌ లో పివిపి సంస్ద నిర్మించిన ఊపిరి చిత్రం అక్కడ మంచి విజయమే సాధించింది. 10.45 కోట్లు వరకూ తెచ్చిపెట్టి రికార్‌‌డ క్రియేట్‌ చేసింది. ఫీల్‌ గుడ్‌ ఎంటరై్టనర్‌ కావటం, ఎంటరై్టన్మెంట్‌ సినిమాకు ప్లస్‌ లుగా నిలిచాయి. రామ్‌ చరణ్‌ కు అక్కడ తొలి హిట్‌ రామ్‌ చరణ్‌,సురేంద్రరెడ్డి కాంబినేషన్‌ లో రూపొందిన ధౄవ చిత్రం ఓవర్‌ సీస్‌ లో 1.40 వరకూ ఇప్పటివరకూ కలెక్‌‌ట చేసింది. ఇంకా స్టిల్‌ కలెక్షన్‌‌స కంటిన్యూ అవుతున్నాయి. ఈ కలెక్షన్‌‌స ఎక్కడికి వెళ్లి ఆగుతాయా అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్న సినిమా పెద్ద విజయం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సైలెంట్‌గా రిలీజైన పెళ్లి చూపులు’ సినిమా యూఎస్‌ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. 1.22 వరకూ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ కు ..కలెక్షన్‌‌స కు సంభందమే లేదు. సినిమా బాగుంటే ..మిగతావన్నీ పట్టించుకోరని నిరూపించింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>