Film, సినిమా

గోల్డెన్ గ్లోబ్ లో ఆమె మెరిసింది

priyanka-beverly-awards-backstage-during-annual-golden_b1876286-d615-11e6-a473-4fa7bf176867

హాలీవుడ్ సినీ పండగ ఆస్కార్‌ వేడుక. దీనికి ముందుగా అందించే గోల్డెన్ గ్లోబ్‌ పురస్కారాల ప్రదానోత్సవాన్ని మినీ ఆస్కార్ ప్రజెంటేషన్‌గా అభివర్ణిస్తారు. లేటెస్ట్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా బంగారు వర్ణం గౌనులో తళుకులీని ఫ్యాషన్ నిపుణులు, ప్రేమికుల నుంచి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన గౌన్‌లో పెదాలపై ప్రకాశవంతమైన లిప్‌స్టిక్‌లో రెడ్ కార్పెట్‌పై పీసీ హొయలుపోయింది. తాము రూపొంచిన ఈ గౌన్‌కు వన్నె తెచ్చిన ప్రియాంక ఫొటోను డిజైనర్లు తమ ట్విట్టర్ పేజ్‌లో సైతం పోస్ట్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ వేడుకకు ఏ వస్త్రాలు సెలక్ట్ చేసుకోవాలో పీసీ తేల్చుకోలేకపోతోందని రెండు రోజుల క్రితం వరకూ వార్తలొచ్చాయి. ఏదేమైనా చివరికి మన గ్లోబల్ స్టార్ మాంచి డిజైనర్ గౌన్ ఎంచుకుని తనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరినీ కట్టిపడేసింది. ఈ వేడుకలో జెఫ్రీ డీన్ మోగాన్‌తో కలిసి బిల్లీ బాబ్ థోటాన్‌కు ఉత్తమ టీవీ నటుడి పురస్కారం అందజేసింది ప్రియాంక చోప్రా.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>