సినిమా

పూరీ – బాలకృష్ణ సినిమా ?

will-balakrishna-accept-puri-for-101st_b_2610160956

సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ క్రేజీ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. స్పీడ్ గా సినిమాలు తీయడంలో అందెవేసిన చేయిగా ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కు ఈ మధ్య సరైన విజయం దక్కడం లేదు. మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుతో ”జనగణమన” సినిమాకు ప్లాన్ చేశాడు. ప్రస్తుతం మహేష్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు కాబట్టి ఇప్పట్లో కుదిరేలా లేదు. దాంతో అయన రామ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ అయ్యేలా లేదు. ఇక ఇటీవలే వెంకటేష్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అది త్వరలోనే సెట్స్ పైకి రానుంది. దాంతో పాటు బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన 101వ సినిమా ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ పూరి జగన్నాథ్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిజంగా అది సంచనలమే అని చెప్పాలి.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>