క్రీడలు

మరోసారి యువరాజ్‌ భారత జట్టులోకి ఎంపికయ్యాడు

India's Yuvraj Singh celebrates taking the wicket of The Netherlands' Wesley Baressi during their ICC Cricket World Cup group B match in New Delhi March 9, 2011.          REUTERS/Adnan Abidi (INDIA  - Tags: SPORT CRICKET)
India's Yuvraj Singh celebrates taking the wicket of The Netherlands' Wesley Baressi during their ICC Cricket World Cup group B match in New Delhi March 9, 2011. REUTERS/Adnan Abidi (INDIA - Tags: SPORT CRICKET)

 

మరోసారి యువరాజ్‌ భారత జట్టులోకి ఎంపికయ్యాడు.

 ఆశ్చర్యకరంగా గత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో బాగా ఆడినప్పుడు వన్డేలను కాదని భారత టి20 జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఈసారి రంజీ ట్రోఫీ ప్రదర్శనను బట్టి వన్డే జట్టులోకి అవకాశం కల్పించారు.   యువరాజ్‌ సింగ్‌ భారత జట్టు తరఫున వన్డేలు ఆడి మూడేళ్లు దాటింది. ఈ ఫార్మాట్‌లో తన చివరి రెండేళ్లలో 19 మ్యాచ్‌లు ఆడిన అతని బ్యాటింగ్‌ సగటు 18.53 మాత్రమే. బహుశా అతను కూడా తన పునరాగమనంపై ఆశలు పెట్టుకొని ఉండకపోవచ్చు. కానీ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అతనిలోని వన్డే ఆటగాడిని చూసింది. దాంతో మరోసారి యువరాజ్‌ భారత జట్టులోకి ఎంపికయ్యాడు

ముంబై: సీనియర్‌ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్, ఆశిష్‌ నెహ్రా భారత జట్టులోకి తిరిగి వచ్చారు. యువీకి వన్డే, టి20 జట్లలో చోటు లభించగా, గాయం నుంచి కోలుకున్న నెహ్రాకు టి20 టీమ్‌లో అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లలో తలపడే భారత జట్లను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. రంజీ ట్రోఫీలో చెలరేగిన ఢిల్లీ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తొలి అవకాశం దక్కడం ఎంపికలో మరో విశేషం. సెలక్షన్‌ కమిటీ సమావేశానికి హాజరు కాలేకపోయిన కోహ్లి… స్కైప్‌ ద్వారా ఎంపికలో భాగమయ్యాడు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>