క్రీడలు

పటిష్ట స్థితిలో భారత్!

20161121_131259-collage

మొహాలి: తొలుత నిలకడ.. తర్వాత తడబాటు.. మళ్లీ నిలకడ.. మొహాలి వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇలా సాగింది కోహ్లీ సేన బ్యాటింగ్‌. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 268/8తో రెండో రోజు, ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను 15 పరుగులకే కుప్పకూల్చారు టీమిండియా బౌలర్లు. భారత్‌ వికెట్లు చేజార్చుకోవడంతో ఆధిక్యం రెండు జట్ల మధ్య దోబూచులాడింది.

పుజారా.. కోహ్లీ అర్ధశతకాలు:
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (12; 38 బంతుల్లో 2×4) జట్టు స్కోరు 39 పరుగుల వద్ద స్టోక్స్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు చిక్కాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నయవాల్‌ ఛతేశ్వర్‌ పుజారా (51; 104 బంతుల్లో 8×4) నిలకడగా ఆడాడు. అయితే అర్ధశతకం దిశగా సాగిన పార్థీవ్‌ పటేల్‌ (42; 85 బంతుల్లో 6×4) ఆదిల్‌ రషీద్‌ వేసిన 20 ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ (62; 127 బంతుల్లో 9×4) తొలుత దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 3వ వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మూడో సెషన్‌ ముందు జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు.

వికెట్లు టప.. టప..:
చివరి సెషన్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. లంచ్‌ తర్వాత టీ విరామానికి 148/2తో వున్న భారత్‌ 8 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి 156/5కు చేరింది. పుజారా (51), అజింక్య రహానె (0)ను ఆదిల్‌ రషీద్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. కోహ్లీ పొరపాటుతో యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌నాయర్‌ (4)ను బట్లర్‌ రనౌట్‌ చేశాడు. శతకంతో ఆదుకుంటాడని భావించిన కోహ్లీ (62)ను 204 పరుగుల వద్ద ఓ చక్కని బంతికి బోల్తా కొట్టించడంతో భారత్‌ కష్టాల్లో పడింది.

ఆదుకొన్న అశ్విన్‌, జడేజా:
పీకల్లోతు కష్టాల్లో వున్న భారత్‌ను ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ (57 బ్యాటింగ్‌; 82 బంతుల్లో 8×4) అర్ధశతకం, రవీంద్ర జడేజా (31 బ్యాటింగ్‌; 59 బంతుల్లో 3×4, 1×6) నిలకడైన బ్యాటింగ్‌ ఆదుకొన్నారు. ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ ఏడో వికెట్‌కు 67 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని 12 పరుగులకు తగ్గించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (3/81), బెన్‌స్టోక్స్‌ (2/48) వికెట్లు తీశారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>