క్రీడలు

మొహాలి టెస్ట్ లో పట్టు బిగిస్తున కోహ్లీ సేన!

20161128_122603-collage

మొహాలి: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారత తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దాంతో భారత్ 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత తొలి సెషన్ లో అత్యంత నిలకడగా ఆడింది.

మొదటి సెషన్ లో అశ్విన్(72;113 బంతుల్లో 11 ఫోర్లు) వికెట్ నే భారత్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో భారత స్కోరు 204 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఆరో వికెట్ గా అవుటయ్యాడు.

దాంతో భారత్ మూడొందల మార్కును చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, అశ్విన్-రవీంద్ర జడేజాల జోడి ఏడో వికెట్ కు 97 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ పైచేయి సాధించింది. మరొకవైపు జడేజా-జయంత్ యాదవ్ ల జోడి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించి అజేయం క్రీజ్ లో ఉండటంతో భారత్ కు మ్యాచ్ పై పట్టుదొరికింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>