క్రీడలు

మొహాలి టెస్ట్ లో ‘కోహ్లీసేన’ ఘన విజయం

20161129_182241-collage

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- రవీంద్ర జడేజా

మూడో టెస్ట్ లో భారత్ ఘన విజయం

సిరీస్‌లో 2-0తో భారత్‌ ఆధిక్యం

మొహాలి: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో దూసుకుపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 78/4తో నాలుగో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ను టీమిండియా బౌలర్లు 236 పరుగులకు కుప్పకుల్చారు. జోరూట్‌ (78), హసీబ్‌ హమీద్‌ (59 నాటౌట్‌) అర్ధశతకాలు చేయడంతో భారత్‌కు ఆ జట్టు 103 పరుగుల లక్ష్యం విధించింది. అశ్విన్‌ 3, షమి, జడేజా, జయంత్‌ యాదవ్‌ తలో 2 వికెట్లు తీశారు. .

పార్థివ్‌ దూకుడు:
భారత రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ (67; 54 బంతుల్లో 11×4, 1×6) చెలరేగి ఆడాడు. టెస్టుల్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత అర్ధశతకం బాదాడు. ఛతేశ్వర్‌ పుజారా (25; 50 బంతుల్లో 4×1), విరాట్‌కోహ్లీ ( 6 నాటౌట్‌; 11 బంతుల్లో)తో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 8 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అతడు కెప్టెన్‌ కోహ్లీ సమక్షంలో విన్నింగ్‌ షాట్‌ కొట్టాడు.

స్కోరు వివరాలు:
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (93.5 ఓవర్లు)
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 417 (138.2 ఓవర్లు)
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 236 (90.2 ఓవర్లు)భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 104/2 (20.2 ఓవర్లు)

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>