Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు,

డ్రంకన్‌ డ్రైవ్‌కు లక్ష్మిహాస్య బాలి

11

 

డ్రంకన్‌ డ్రైవ్‌కు లక్ష్మిహాస్య బాలి

హైదరాబాద్‌:  నారాయణమ్మ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న.  రామ్మోహన్‌ కుమార్తె లక్ష్మిహాస్య(20 ఆదివారం గీతం ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన తన స్నేహితుడు  విశాల్‌ పుట్టిన రోజు కావడంతో ఫ్రెండ్స్‌తో కలసి బయల్దేరింది. సంతోషి, రోహిత్, నిధి, విశాల్‌లతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని ఓహ్రీస్‌ రెస్టారెంట్‌కు వచ్చారు. డ్రంకన్‌ డ్రైవ్, మితిమీరిన వేగం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆమె.. కారులో స్నేహితులతో తిరిగి వస్తూ ప్రమాదంలో కన్నుమూసింది. విశాల్, రోహిత్‌ మద్యం సేవించగా సంతోషి, లక్ష్మి హాస్య, నిధి భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు విశాల్‌ కారు (ఫోక్స్‌వ్యాగన్‌ టీఎస్‌ 11ఈసీ 2324)లో ఓహ్రీస్‌ నుంచి రాణిగంజ్‌ వైపు వెళ్తున్నారు. విశాల్‌ కారు నడుపుతున్నాడు. జలవిహార్‌ దాటిన తర్వాత బతుకమ్మ కుంట వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న లక్ష్మిహాస్య ఎగిరి బయట పడింది.  గతంలో పంజగుట్టలో మైనర్లు మద్యం సేవించి కారు నడపడం వల్లే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. లక్ష్మి కు తీవ్రంగా దెబ్బలు తలడంతో ఆమెను ఆమెను వెంటనే కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాల్‌ తండ్రి కరీంనగర్‌లో పేరున్న న్యాయవాది. 21 ఏళ్లు నిండినవారికే మద్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా రెస్టారెంట్‌ నిర్వాహకులు పట్టించుకోలేదు. 20 ఏళ్లున్న విశాల్‌కు మద్యం ఇచ్చారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>