Breaking News, Uncategorized,

పాట పాడారు… పాపులర్ అయ్యారు

bapu-sehat

ఒక్క చాన్స్… ఒకే ఒక్క చాన్స్. ఆ మారుమూల పల్లె పిల్లల్ని స్టార్లను చేసింది. ఎంతటి వారికైనా వారి గొంతు పదే పదే వినాలనిపించేలా చేసింది. ఆమిర్ ఖాన్ ఇటీవలి సూపర్ హిట్ మూవీ దంగల్ ఎంతో మంది కొత్త తరానికి పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్‌గా మారింది. దంగల్ మూవీ ఎంత హిట్టో… ఆమిర్ బంగారు పతకం కోసం తన కూతుళ్లను రెజ్లింగ్ పోటీలకు సాన పెట్టేటప్పుడు వచ్చే పాట “బాపూ సేహత్ కే లియే” అంతే పాపులర్. ప్రేక్షకులను కట్టి పడేసే ఆ మెస్మరైజింగ్ సాంగ్ ఇదే.

ఇంతటి అద్భుతమైన పాట పాడింది ఏ ప్రొఫెషనల్, సీనియర్ సింగర్సో కాదు. ఓ సాదాసీదా పల్లె పిల్లలు. తమ ఊరు తప్ప మరో ప్రపంచం తెలియని చిన్నారులు. వారే రాజస్థాన్‌ జైసల్మేర్‌‌లోని డంగ్రీ, బర్నా గ్రామాలకు చెంది సర్వర్ అండ్ సర్తాజ్. దంగల్‌లోని “బాపూ సేహత్ కే లియే” అనే ఒకే ఒక్క పాట ఒక్కసారిగా వీరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఈ పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడుతున్నారు. మేము స్కూల్ వర్క్ పూర్తి చేయలేదని మా టీచర్లు మమ్మల్ని తిట్టే వారు. కానీ దంగల్‌లో మేం పాడిన పాట విని ఇప్పుడు వారు మమ్మల్ని మెచ్చుకుంటున్నారని లిటిల్ సింగర్స్ సర్వర్, సర్తాజ్ సంతోషంగా చెప్తున్నారు. దంగల్‌కి ముందు వరకూ వీరిద్దరి గురించి తమ గ్రామస్తులకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా సర్వర్, సర్తాజ్ గురించి తెలుసుకుని వచ్చి మరీ వీరితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. జనం తమని తమ పేర్లతో గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందంగా చెప్తున్నారీ చిచ్చరపిడుగులు. ఇంత గొప్ప అవకాశం మాకు దొరుకుతుందని మేమెప్పుడూ ఊహించలేదని మురిసి పోతున్నారు.

dang-song

ఈ పిల్లలిద్దరి రక్తంలో సంగీతం ప్రవహిస్తోంది. సర్వర్, సర్తాజ్ వివిధ వేదికలపై తమ జానపద కళను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆడిషన్స్‌లో సెలక్టయ్యాక… ఈ పాట పాడడానికి ముందు సర్వర్, సర్తాజ్ శిక్షణ పొందారు. వీరే కాదు… గతంలోనూ మమ్మే ఖాన్, స్వరూప్ ఖాన్, కుట్లే ఖాన్ వంటి జానపద కళాకారులు బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ గొంతు వినిపించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>